ప్రధాని మోదీ అంటే నాకు ప్రాణం: డీఎస్ కుమారుడు

  • నా తండ్రి నన్ను బీజేపీలోకి పంపలేదు
  • టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నా
  • రానున్న ఎన్నికల్లో కవితకు ప్రజలు బుద్ధి చెబుతారు
టీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత డీఎస్ ను బహిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలు కేసీఆర్ ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేసీఆర్ ను కలిసేందుకు డీఎస్ ప్రయత్నించినప్పటికీ... ఆయనకు అపాయింట్ మెంట్ దొరకలేదు. ఈ నేపథ్యంలో డీఎస్ కుమారుడు అరవింద్ స్పందిస్తూ, తన తండ్రి తనను బీజేపీలోకి పంపారంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఈ ఆరోపణలను తాను ఖండిస్తున్నానని తెలిపారు.

అర్థం లేకుండా తన కుటుంబంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. తాను ముందు నుంచి బీజేపీకి మద్దతుగా ఉన్నానని... ఇందులో తన తండ్రి ప్రమేయం లేదని చెప్పారు. ప్రధాని మోదీ కోసం తాను ప్రాణమిస్తానని తెలిపారు. గత నాలుగేళ్లలో నిజామాబాద్ జిల్లాకు ఎంపీ కవిత చేసిందేమీ లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కవితకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
Go Back to Shorts
ds
aravind
modi
kavitha

More Telugu News